ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ ఎలీస్ పెర్రీ అరుదైన ఘనత సొంతం చేసుకుంది. అంతర్జాతీయ క్రికెట్ 3 ఫార్మాట్లలోనూ 1000+ రన్స్ చేసిన 2వ ప్లేయర్గా నిలిచింది. భారత్తో టెస్టులో ఈ ఘనత సాధించిన ఆమె.. ఇప్పటివరకు T20ల్లో 2201, వన్డేల్లో 4504, టెస్టుల్లో 1006 రన్స్ చేసింది. పెర్రీ కంటే ముందు చార్లెట్ ఎడ్వర్డ్స్(ENG) T20ల్లో 1676, వన్డేల్లో 5992, టెస్టుల్లో 2605 రన్స్ చేసింది.