IPL 2026 సీజన్లో ఇషాన్ కిషన్ సారథ్యంలోని SRH అంచనాల్ని అందుకోలేకపోతోంది. ఇప్పటివరకు 4 మ్యాచ్లు ఆడిన సన్రైజర్స్.. కేవలం ఒకేఒక్క విజయాన్ని నమోదు చేసింది. రెగ్యులర్ కెప్టెన్ కమిన్స్ అందుబాటులో లేకపోవడం జట్టుపై ప్రభావం చూపుతోందని విశ్లేషకులు అంటున్నారు. బ్యాటింగ్లో అభిషేక్, క్లాసెన్ రాణిస్తున్నా.. బౌలర్ల వైఫల్యం ప్రతికూలంగా మారుతోంది.