ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ అరుదైన రికార్డు సాధించాడు. IPLలో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడుతున్న బట్లర్, DCతో మ్యాచ్లో 5 సిక్సర్లు బాదాడు. దీంతో T20ల్లో 600 సిక్సర్ల మైలురాయిని చేరుకున్నాడు. మొత్తంగా అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్ల జాబితాలో 5వ స్థానానికి దూసుకెళ్లాడు. గేల్(1056), పొలార్డ్(982), రస్సెల్(784), పూరాన్(712) తొలి నాలుగు స్థానాల్లో ఉన్నారు.