RR టీమ్ మేనేజర్ రోమీ భిందర్ IPL నిబంధనలను ఉల్లంఘించి డగౌట్లో మొబైల్ వాడటం చర్చనీయాంశమైంది. BCCI యాంటీ కరప్షన్ యూనిట్(ACU) నిబంధనల ప్రకారం మ్యాచ్ సమయంలో ఫోన్ వాడటం నిషేధం. దీనిపై వివరణ కోరుతూ ACU నోటీసులు ఇవ్వగా.. రోమీ క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఆ సమయంలో రోమీ పక్కన వైభవ్ సూర్యవంశీ కూడా ఫోన్ చూశాడు. దీంతో అతడిని హెచ్చరించి వదిలేసినట్లు తెలుస్తోంది.