ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ తొడ కండరాల గాయంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. నిన్నటి ప్రాక్టీస్ సెషన్లో ఆయన కనిపించకపోవడంతో గురువారం పంజాబ్ కింగ్స్‌తో జరిగే మ్యాచ్‌లో ఆడటంపై సందిగ్ధత నెలకొంది. అయితే మెడికల్ స్కానింగ్‌లో ఎలాంటి చీలిక కనిపించలేదని, గాయం చిన్నదేనని క్రిక్‌బజ్ తెలిపింది. దీంతో ఎక్కువ మ్యాచ్‌లకు దూరమయ్యే ఛాన్స్ లేదని పేర్కొంది.