BPT: ఈ నెల 19న బాపట్లలో జరిగే రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం తొలి వార్షికోత్సవాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు తాండ్ర సాంబశివరావు కోరారు. అన్నం సతీష్ ప్రభాకర్ కళ్యాణ మండపంలో ఈ సభ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమానికి ఎంపీ కృష్ణప్రసాద్, ఎమ్మెల్యే నరేంద్ర వర్మ, కలెక్టర్ వినోద్ కుమార్లు ముఖ్య అతిథులుగా హాజరవుతారని చెప్పుకొచ్చారు.