కోనసీమ: ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక కార్యక్రమమని బీజేపీ సీనియర్ నాయకులు కోన సత్యనారాయణ అన్నారు. ఇళ్లపై రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవడానికి ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. దీంతో విద్యుత్ బిల్లులు గణనీయంగా తగ్గుతాయని, నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందవచ్చన్నారు.