WNP: రహదారి భద్రత నియమాలను పాటించడం అత్యంత ముఖ్యమని ప్రతి ఒక్కరూ రహదారిపై ప్రయాణించేటప్పుడు హెల్మెట్ ధరించాలి. కారులో ప్రయాణించే వారు అయితే సీట్ బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. జిల్లాలో గత నాలుగు నెలల్లో వేర్వేరు రోడ్డు ప్రమాదలలో ఇప్పటికే 20 మందికి పైగా దుర్మరణం చెందారని అది అత్యంత బాధాకరమన్నారు.