తెలంగాణపై MP తేజస్వీ సూర్య అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటే రాష్ట్ర బీజేపీ MPలు మౌనంగా ఉండటంపై ప్రభుత్వ విప్ వేముల వీరేశం ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు రాష్ట్ర ఏర్పాటు బీజేపీకి ఇష్టం లేదా అని ప్రశ్నించారు. కిషన్ రెడ్డిని ‘తెలంగాణ ద్రోహి’గా పేర్కొన్న ఆయన.. అప్పట్లో మద్దతిచ్చిన సుష్మా స్వరాజ్‌ను కూడా తప్పుబడుతున్నారా అని నిలదీశారు. బీజేపీకి ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.