MBNR: విద్యుత్ ఆర్టిజన్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీఆర్ఎస్ మెదక్ ఇంఛార్జ్ కంఠారెడ్డి తిరుపతి రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం మెదక్లో 10వ రోజు సమ్మెకు ఆయన సంఘీభావం తెలిపారు. ఆర్టిజన్ల కష్టానికి తగిన ప్రతిఫలం దక్కడం లేదని, ప్రభుత్వం స్పందించకుంటే అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కార్మికులు కార్యాలయం ముందు వంటా వార్పు నిర్వహించారు.