ATP: ఢిల్లీ పర్యటనలో ఉన్న ఎమ్మెల్యే బండారు శ్రావణి తోటి మహిళా ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి రాజ్యసభ సభ్యులు సానా సతీష్ నివాసాన్ని సందర్శించారు. అక్కడ వారి ఆతిథ్యం స్వీకరించిన అనంతరం తోటి మహిళా ప్రతినిధులతో కలిసి సెల్ఫీలు దిగారు. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెడుతున్న తరుణంలో ఢిల్లీలో ఉండటం గర్వంగా ఉందని ఆమె పేర్కొన్నారు.