ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్‌ను టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ప్రశంసించాడు. రాహుల్ క్రీజులో సెట్ అయితే దూకుడుగా ఆడగలడని కొనియాడాడు. అయితే రాహుల్‌కు ఉన్న ఏకైక సమస్య అతని మైండ్ సెట్టేనని అభిప్రాయపడ్డాడు. కాగా, గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో రాహుల్(92) పరుగులతో అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చిన సంగతి తెలిసిందే.