2025 ఐపీఎల్ సీజన్లో పర్పుల్ క్యాప్‌ను గెలుచుకున్న GT బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ, ఈ సీజన్లోనూ అదే తరహా ప్రదర్శనను పునరావృతం చేస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో 10 వికెట్లతో పర్పుల్ క్యాప్ లీడర్ బోర్డులో అగ్రస్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో రవి బిష్ణోయ్ (9 వికెట్లు), అన్షుల్ కంబోజ్ (8 వికెట్లు) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.