IPL చైర్మన్ అరుణ్ ధుమాల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్‌ను మరింత విస్తృతం చేయాలనే డిమాండ్లపై ఆయన స్పందించాడు. మరో రెండు జట్లు చేర్చి.. మ్యాచ్‌ల సంఖ్య పెంచే అవకాశం లేదని సంకేతాలు ఇచ్చాడు. మ్యాచ్‌ల సంఖ్యను 74 నుంచి 94కు పెంచడం కష్టమని తెలిపాడు. మార్చి- మే వరకు దీనిని పరిమిత విండోలో మాత్రమే నిర్వహించగలమని స్పష్టం చేశాడు.