SRCL: ముగ్గురు అంతర్ జిల్లా దొంగలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని సిరిసిల్ల సీఐ నాగేశ్వరరావు తెలిపారు. మార్చి 30,2026న తంగళ్ళపల్లి మండలం తాడూరులో ఓ ఇంట్లో చొరబడి రెండు తులాల బంగారం, 11 తులాల వెండి, రూ. 3వేల నగదును ఎత్తుకెళ్లారన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మహమ్మద్ అబ్జల్ భాష, పిట్టల అరవింద్, సామల బాలకిషన్‌ను రిమాండ్‌కు తరలించామన్నారు.