KMM: వైరా మున్సిపాలిటీలో ఆదివారం సాయంత్రం 13వ వార్డు కౌన్సిలర్ ముళ్లపాటి విజయపై దాడి ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. అమృత పైప్లైన్ పనులను పర్యవేక్షిస్తున్న సమయంలో అదే వార్డుకు చెందిన అన్వర్ అనే వ్యక్తి దుర్భాషలాడుతూ దాడికి పాల్పడినట్లు బాధితురాలు తెలిపారు. అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించారు. ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.