CTR: కాణిపాకంలో స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు శ్రీనివాసరాజు దర్శించుకున్నారు. దేవస్థానం ఈవో పెంచల కిషోర్ ఆయనకు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో రవీంద్రబాబు, ప్రోటోకాల్ ఏఈవో ధనపాల్ పాల్గొన్నారు.