W.G: ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు వ్యవసాయ శాఖ ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ నాగరాణి సూచించారు. గురువారం భీమవరం కలెక్టరేట్లో రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మాస్టర్ ట్రైనర్స్ 3రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. గత ఏడాది అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఈ ఏడాది మరింత మెరుగైన ప్రణాళికలతో రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.