ప్రకాశం: కొండపి మండలం అనకర్లపూడి అట్లేరు సమీపంలో గురువారం సాయంత్రం ఐదుగురిని అరెస్ట్ చేసి, 3.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ సోమశేఖర్ తెలిపారు. మర్రిపూడి మండలం వేమవరం గ్రామానికి చెందిన కందిమల్ల నారాయణతో పాటు మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నామన్నారు. వారిపై కేసు నమోదు చేసి పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.