SKLM: జిల్లాలో 912 గ్రామ పంచాయతీల్లో శుక్రవారం నుంచి ప్రత్యేకాధికారుల పాలన సాగనుంది. గురువారంతో పంచాయతీ పాలకవర్గాల పదవీ కాలం ముగిసింది దీంతో గ్రామ పంచాయతీలకు ప్రత్యేకా ధికారులను నియమిస్తూ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామాలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని డీపీఓ గోపి బాల తెలిపారు.