రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగాల్సిన గౌహతి స్టేడియంలో వరుణుడు కాస్త శాంతించాడు. ఇంకా స్వల్పంగా చినుకులు పడుతున్నప్పటికీ ‘సూపర్ సోపర్’ యంత్రాల సహాయంతో అవుట్‌ఫీల్డ్‌ను త్వరగా పొడిగా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మైదానం సిద్ధమైతే అంపైర్లు పిచ్‌ను పరిశీలించి, టాస్ సమయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.