KNR: జిల్లాలోని పరిశ్రమలు, ఆసుపత్రులు తదితర సేవా రంగ సంస్థల్లో యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ చిత్రా మిశ్రా పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో వివిధ ప్రైవేట్ పరిశ్రమలు, కంపెనీల ప్రతినిధులు, ఫ్యూచర్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ డైరెక్టర్ మాట్లాడారు.