MBNR: బండర్పల్లిలో వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన, భక్తులతో కలిసి మొక్కులు చెల్లించుకున్నారు. ఇందిరమ్మ గృహప్రవేశ కార్య క్రమంలో పాల్గొని లబ్ధిదారులను అభినందించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.