ASF: ఏప్రిల్ 3న TPCC రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆసిఫాబాద్లో పర్యటించనున్నారని DCC అధ్యక్షురాలు ఆత్రం సుగుణ తెలియజేశారు. గురువారం స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో నాయకులతో సమావేశమై ఆమె మాట్లాడారు. పట్టణంలోని రోజ్ గార్డెన్లో మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనున్న జనరల్ బాడీ సమావేశానికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని కోరారు.