SRPT: వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు కోదాడ ఆర్టీసీ బస్టాండ్లో సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీనిని డిపో మేనేజర్ శ్రీనివాసరావు ప్రారంభించారు. సేవా సమితి చేస్తున్న ఈ కృషి అభినందనీయమని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ నాగమణి, సమితి సభ్యులు పాల్గొన్నారు.