E.G: రాజమండ్రి కలెక్టరేట్ వద్ద గల వికాస కార్యాలయంలో ఈనెల 4వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం తెలిపారు. టెన్త్ నుంచి పీజీ వరకు చదివిన 35 ఏళ్లలోపు అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చని పేర్కొన్నారు. పలు ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.