CTR: జిల్లా వ్యాప్తంగా డ్రోన్ నిఘాతో పోలీసులు భద్రతను బలోపేతం చేస్తున్నారు. నిర్మానుష్య ప్రదేశాలు, పాడుబడిన భవనాలు, క్రైమ్ ప్రోన్ ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు. బహిరంగంగా మద్యం సేవించడం, గంజాయి వినియోగం, పేకాట, దొంగతనాలు వంటి అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించి చర్యలు చేపడుతున్నారు.