IPL కోసం 2008లో యువ కోహ్లీని అతని హోంటీమ్ ఢిల్లీ డేర్‌డెవిల్స్ తీసుకోకపోవడానికి గల కారణాన్ని తాజాగా వీరేంద్ర సెహ్వాగ్ చెప్పాడు. తాను, గంభీర్ ఓపెనర్లుగా.. జట్టులో దిల్షాన్, ధవన్ వంటి టాపార్డర్ బ్యాటర్లు చాలా మంది ఉన్నారని గుర్తుచేశాడు. బ్యాటర్లు ఎక్కువ కావడం, మరో బౌలర్ అవసరం ఉండటంతో.. 3-4 స్థానాల్లో ఆడుతున్న కోహ్లీని కాదని ప్రదీప్ సాంగ్వన్ని తీసుకున్నామన్నాడు.