RRతో మ్యాచులో SRH కెప్టెన్ ఇషాన్ కిషన్‌కి బదులు సలీల్ అరోరా కీపింగ్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఇషాన్ మాట్లాడుతూ.. స్టంప్స్ వెనక ఉండటం వల్ల మిస్ కమ్యూనికేషన్ అవుతోందని పేర్కొన్నాడు. బౌలర్లతో తరచూ మాట్లాడకుంటే అనుకున్న వ్యూహాలు అమలు చేసే వీలుండదు అని, అందుకే కీపింగ్ బాధ్యతలను వేరొకరికి ఇచ్చానని చెప్పాడు. రానున్న మ్యాచుల్లోనూ ఇలాగే చేసే అవకాశం లేకపోలేదన్నాడు.