TG: టీమిండియా యువ క్రికెటర్ తిలక్ వర్మ సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశాడు. టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచిన భారత జట్టులో సభ్యుడైనందుకు గాను, తిలక్‌ను సీఎం శాలువాతో సత్కరించి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అజారుద్దీన్, వాకటి శ్రీహరి పాల్గొని తిలక్ వర్మ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.