AP: తమను ఆదుకోవాలంటూ అనంతపురం జిల్లా కలెక్టరేట్ వద్ద అరటి రైతులు గెలలతో నిరసన చేపట్టారు. యుద్ధం కారణంగా ఎగుమతులు నిలిచిపోవడంతో టన్ను ధర రూ. 15 వేల-రూ. 5 వేలకు పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరాకు లక్షల్లో పెట్టుబడి పెట్టామని, ప్రభుత్వం వెంటనే స్పందించి టన్నుకు రూ. 15 వేల మద్దతు ధరతో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.