కోనసీమ: కోటిపల్లి-నర్సాపురం రైల్వే ప్రాజెక్ట్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, నిధులు విడుదల చేయాలని అమలాపురం ఎంపీ హరీష్ మాధుర్ లోక్ సభ లో కోరారు. సోమవారం రైల్వే గ్రాంట్లపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. దశాబ్దాలుగా ఉన్న ఈ ప్రాజెక్టును 2026-27 బడ్జెట్ నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించారని ఎంపీ తెలిపారు.