TPT: నాగలాపురం(మం) పల్లికొండేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ప్రదోష పూజలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ఛైర్మన్ డీ. పద్మనాభరాజు, ఈవో పీ. లత సమక్షంలో నందీశ్వర స్వామి, వాల్మీకేశ్వర స్వామి వారికి అభిషేకాలు, పుష్పాలంకరణతో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలకమండలి సభ్యులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.