TG: లైంగిక దాడి కేసులో మెదక్ పోక్సో కోర్టు సంచలన తీర్పునిస్తూ అటెండర్ సారా జైపాల్‌కు 20 ఏళ్ల కఠిన శిక్ష విధించింది. 2019లో పాఠశాల బాలికపై అతడు లైంగిక దాడి చేసినందుకు ఈ తీర్పు ఇచ్చింది. శిక్షతో పాటు బాధితురాలికి లక్ష రూపాయల పరిహారం చెల్లించాలని న్యాయమూర్తి ఆదేశించారు. పిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడితే చట్టం కఠినంగా ఉంటుందని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.