VSP: వీఎంఆర్డీఏలో ప్రజా దర్బార్‌కు వచ్చిన వినతుల పరిష్కారంలో అధికారులు అలసత్వం వహించవద్దని సంస్థ ఛైర్మన్ ఎం.వి. ప్రణవ్ గోపాల్ ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజా దర్బార్‌లో మెట్రోపాలిటన్ కమిషనర్ ఎన్. తేజ్ భరత్‌తో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వచ్చిన ఫిర్యాదులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని, సిబ్బంది జవాబుదారీగా వ్యవహరించాలన్నారు.