WGL: హైదరాబాద్ సచివాలయంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నర్సంపేట డివిజన్‌కు చెందిన రైతులకు వ్యవసాయ యంత్రాలపై సబ్సిడీ కల్పించి న్యాయం చేయాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అలాగే వ్యవసాయ అభివృద్ధికి తగిన నిధులు కేటాయించి రైతులను ఆదుకోవాలని కోరారు.