TG: యాసంగి సీజన్లో 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 8,251 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, రైతులకు ఇబ్బంది కలగకుండా ఆధునిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. ఈసారి 152 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేసినట్లు పేర్కొన్నారు.