AP: రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్(RDT) సమస్యల పరిష్కారానికి కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుతో మంత్రి పయ్యావుల కేశవ్ భేటీ అయ్యారు. ఆయన వెంట ఎంపీలు అంబికా లక్ష్మీనారాయణ, సానా సతీష్ ఉన్నారు. FCRA కింద విదేశీ నిధులకు గతంలో కేంద్రం అనుమతి రద్దు చేసింది. ఇది RDT వ్యవహారాలకు సమస్యగా మారిందని చెప్పగా.. వెంటనే చర్చలు జరుపుతామని రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు.