NZB: నందిపేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సీనియర్ అసిస్టెంట్ గణేశ్‌కు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. సోమవారం ఆమె PHCని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అటెండెన్స్ రిజిస్టరు పరిశీలించారు. హాజరు పట్టికలో గణేశ్ సంతకాలు చేయకపోవడం గమనించిన కలెక్టర్ ఆయన గురించి వాకబు చేశారు. మూడు రోజులుగా PHCకి రాలేదని గుర్తించి నోటీసు జారీ చేయాలన్నారు.