CTR: బంగారుపాళ్యం(మం) టేకుమందలో “రైతన్నా మీ కోసం” కార్యక్రమంలో భాగంగా పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ రైతుల ఇంటింటికి వెళ్లి పలకరించారు. అన్నదాత సుఖీభవ నిధులు బ్యాంకు ఖాతాలో పడ్డాయా అని ఆరా తీశారు. ఎమ్మెల్యే గ్రామంలో పర్యటించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.