దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 డిగ్రీలు నమోదవుతున్నాయి. రాబోయే రోజుల్లో 45 డిగ్రీలు దాటుతాయని, మే, జూన్లో ఎండలు మరింత తీవ్రమవుతాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఏడాది వేసవి సుదీర్ఘంగా ఉంటుందని చెబుతున్నారు. వాతావరణ మార్పులతో వర్షాలు కురిస్తే తప్ప ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం లభించదని పేర్కొంటున్నారు.