TG: మాజీ మంత్రి జీవన్ రెడ్డిని ఉద్దేశించి జగిత్యాల MLA సంజయ్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. జీవన్ రెడ్డికి నెలరోజుల కిందట BRS నుంచి ప్యాకేజి అందిందని.. అందుకే CM రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. జీవన్ రెడ్డి చేరికతో BRSలో ముసలం మొదలైందన్నారు. హరీష్ జగిత్యాల సభకు రాకపోవడమే ఇందుకు ఉదాహరణ అన్నారు. తాను జగిత్యాల అభివృద్ధి కోసమే కాంగ్రెస్లో చేరానని స్పష్టం చేశారు.