TG: ప్రజాకవి గద్దర్ గజ్జె కట్టి తెలంగాణ ఉద్యమాన్ని గల్లీగల్లీకి తీసుకెళ్లారని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. విద్యారంగంలో అణగారిన వర్గాలకు పెద్దపీట వేస్తున్నామని, ప్రస్తుతం ఓయూ, అంబేద్కర్ వర్సిటీల వైస్ ఛాన్సలర్లుగా ఎవరున్నారో గమనించాలని సూచించారు. అణగారిన వర్గాల అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు పట్టం కట్టాలని కోరారు.