కాలుష్య నియంత్రణ (PUC) సర్టిఫికేట్ లేనందుకు పోలీసులు ఓ ఎలక్ట్రిక్ వాహనదారుడికి చలాన్ జారీ చేశారు. ఈ ఘటన రాజస్థాన్లోని నాగౌర్లో చోటుచేసుకుంది. వాహన తనిఖీల్లో భాగంగా టాటా టియాగో ఈవీ కారును రాష్ట్ర పోలీసు ఆపారు. కారుకు బ్లాక్ ఫిల్మ్ అమర్చి ఉండడంతో రూ.200తో పాటు నో పొల్యూషన్ సర్టిఫికెట్ లేకపోవడంతో అదనంగా రూ.1,500 జరిమానా విధించారు.