TG: ఖాల్సా పంథ్ స్థాపనకు గుర్తుగా జరుపుకునే “వైశాఖి” పండుగను తెలంగాణ సిక్కు సమాజం ఇవాళ భక్తి, శ్రద్ధలతో అత్యంత వైభవంగా నిర్వహించింది. HYD అమీర్‌పేట్‌లోని గురుద్వారా సాహెబ్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వందలాది మంది సిక్కు భక్తులు, ఇతర మతాల ప్రజలు “విశాల్ దీవాన్” (మహా సభ)లో పాల్గొన్నారు.