TG: బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్యను పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేయాలని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. సభలో బీఆర్ఎస్ ఎంపీలు ఉంటే బీజేపీ ఎంపీకి గుణపాఠం చెప్పేవారన్నారు. తేజస్వీ వ్యాఖ్యలపై కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ స్పందించాలన్నారు. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామన్నారు.