AP: అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలపై చర్చ కొనసాగుతోంది. నెలకు రూ.10 వేల కన్నా ఎక్కువ ఆదాయం ఉంటే ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు పథకాలు వర్తించవని మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఏడాదికి రూ.1.20 లక్షలు, పట్టణాల్లో రూ.1.44 లక్షల ఆదాయం మించి ఉంటే ప్రభుత్వ పథకాలకు అనర్హులు అని వెల్లడించారు.