TG: అంగన్వాడీలకు ఇచ్చిన సెల్ఫోన్లలో కుంభకోణం చేసిన మంత్రి సీతక్క నోరు అదుపులో పెట్టుకోవాలని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్కు సంబంధం లేకున్నా డైవర్షన్ కోసం లీగల్ నోటీసులు పంపడం సరైంది కాదన్నారు. రూ. 6 వేల ధర ఉన్న ఫోనుకు రూ.14 వేలు పెట్టి కొనడం అవినీతి కాదా? అని ప్రశ్నించారు. మహిళా మంత్రిగా సీతక్క మాట్లాడే మాటలు ఇవేనా అని మండిపడ్డారు.