AP: మంగళగిరి ఆరో బెటాలియన్లో హెడ్ కానిస్టేబుల్ మృతి చెందాడు. శిక్షణలో భాగంగా 3.2 కిలోమీటర్ల పందెం పోటీలను నిర్వహించారు. ఈ క్రమంలో పోటీలో విజయవాడ రామవరప్పాడుకు చెందిన కానిస్టేబుల్ కొలసాని వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. కొంచెం దూరం పరిగెత్తిన వెంకటేశ్వరరావు గుండెపోటుతో మరణించారు.