యువ నటుడు వరుణ్ తేజ్ ‘బరి’ సినిమా ప్రాక్టీసులో గాయపడి, మోకాలి శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వరుణ్ త్వరగా కోలుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. వైద్యులు, ఫిజియోల సూచనలు పాటిస్తూ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి కెమెరా ముందుకు రావాలని ఆయన కోరుకున్నారు.